అఫిషియల్‌ : ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా వెయ్యి కోట్ల మార్క్‌ క్రాస్‌

టాలీవుడ్ జక్కన్న మరో అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు.ఇప్పటి వరకు రెండు ఇండియన్ సినిమాలు మాత్రమే 1000 కోట్ల మార్కును క్రాస్‌ చేశాయి.

 Rrr Movie Collections In World Wide , Movie News, Rajamouli, Ram Charan, Rrr, Rr-TeluguStop.com

అందులో ఒకటి రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన బాహుబలి 2 కాగా మరోటి బాలీవుడ్ లో తెరకెక్కిన అమీర్ ఖాన్ దంగల్ మూవీ.ఆ రెండు సినిమాల తర్వాత మరో వెయ్యి కోట్ల సినిమా రావడానికి ఐదు సంవత్సరాలకు మించి పట్టింది.

ఎట్టకేలకు మళ్లీ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వెయ్యి కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది.రాజమౌళి దర్శకత్వం లో సినిమా అనగానే అంచనాలు భారీ గా ఉన్నాయి.

వెయ్యి కోట్లు వసూలు నమోదవడం కావడం పక్కా అంటూ ప్రతి ఒక్కరు భావించారు.కానీ ఈ సినిమా విడుదలైన రోజు వచ్చిన టాక్ తో ఖచ్చితంగా రూ.1000 కోట్ల వరకు వసూలు సాధించడం అనుమానమే అంటే ప్రతి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu Rajamouli, Ram Charan, Rrr-Movie

బాహుబలి 2 సినిమా 1800 కోట్ల వసూళ్లను రాబట్టింది.కానీ ఆ సినిమా స్థాయిలో ఈ సినిమా ఉండదని.అలాగే కనీసం వెయ్యి కోట్ల కలెక్షన్స్ను కూడా ఈ సినిమా రాబట్టలేకపోవచ్చు అంటూ ప్రతి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

కానీ ఇండియన్ సినీ ప్రేక్షకులు మరియు విదేశాలలో ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులు ఈ సినిమా కు 1000 కోట్ల కలెక్షన్స్ను కట్ట బెట్టారు రెండు వారాలు పూర్తి కాక ముందే ఈ సినిమా ఈ స్థాయిలో వసూళ్లను దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు.మరో రూ.250 కోట్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.సినిమా రూ.1000 కోట్ల వసూళ్ల ను చేసిన నేపథ్యం లో బాలీవుడ్ కి చెందిన ప్రముఖ స్టార్ హీరోల సమక్షం లో సక్సెస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సక్సెస్ పార్టీ కి బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube