ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్ వడ్డే నవీన్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం “చాలా బాగుంది” .ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటి మాళవిక.
ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
ఈ క్రమంలో సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో సురేష్ మేనన్ అనే వ్యక్తిని 2007 లో వివాహం చేసుకుంది.పెళ్లి జరిగిన తర్వాత మాలవిక సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటోంది.
కానీ రజినీకాంత్ నయనతార నటించిన చంద్రముఖి సినిమాలో చివరిసారిగా కనిపించింది.ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం బుల్లితెరపై ఒక టీవీ షోలో పాల్గొన్న తర్వాత ఆమె ముఖానికి మేకప్ వేసుకొని ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యింది.1999లో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఉన్నై తేడి’ సినిమా ద్వారా పరిచయమైన మాళవిక ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది.

సుందర్ దర్శకత్వంలో గోల్‌మాల్ (తమిళం) అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జై, జీవ హీరోలుగా నటిస్తున్నారు.ఈ సినిమాలో మాళవిక ‘మంగమ్మ‘ అనే పాత్రలో కనిపించనుంది.ఈ చిత్రంలో అమృత అయ్యర్, రైజా విల్సన్, ఐశ్వర్య దత్తా, మనోబాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవలే సినిమా షూటింగ్ మొదలు పెట్టారు.ఈ క్రమంలో మాళవిక షూటింగ్ లో పాల్గొన్న కొన్ని ఫొటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.








