ఆర్ఆర్ఆర్ టైటిల్‌పై ఫ్యాన్స్ లొల్లి

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా టైటిల్‌ ఆర్ఆర్ఆర్‌కు అసలు పేరు ఏమిటనేదానిపై చిత్ర వర్గాల్లో పలు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఆర్ఆర్ఆర్‌కు ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

అయితే ఈ విషయంలో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండటంతో ఈ సినిమాకు దేశభక్తిని పెంపొందించే టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది.

కానీ ఆవేశానికి మారుపేరైన ఈ స్వాతంత్ర్య సమరయోఘులకు గాంధీ ఉపయోగించిన శ్లోకం ఎంతవరకు సెట్ అవుతుందని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.ఏదేమైనా ఆర్ఆర్ఆర్ చిత్ర టైటిల్‌పై ప్రేక్షకులు చేస్తున్న లొల్లికి చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి అంటున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాకు నిజంగానే ‘రఘుపతి రాఘవ రాజారామ్’ అనే టైటిల్‌ను పెడతారా లేక వేరే ఏదైనా టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అనేది చూడాలి.రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, నటి ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా గెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు