వైరల్ వీడియో: రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ డాన్స్ మాములుగా లేదుగా..!

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు హల్చల్ చేస్తూనే ఉంటాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు మన టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ చేసిన డాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

భారత క్రికెటర్ అయిన శ్రేయస్ అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఒక్కసారిగా న్యూజిలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ లో సెంచరి కొట్టి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు.

దీంతో అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ చేసిన 16వ భారతీయ ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ పేరు సంపాదించుకున్నాడు.అలాగే శ్రేయాస్ సాధించిన మరో ఫీట్ ఏంటంటే.

ముంబై నుంచి ఈ ఫీట్‌ సాధించిన మూడో ఆటగాడిగా కూడా శ్రేయస్‌ పేరు సంపాదించుకున్నాడు.ఈ క్రమంలోనే తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్‌ పై ప్రేక్షకులు సర్వత్రా ప్రశంసలు కురిపించారు.

Advertisement

అలాగే శ్రేయాస్ అయ్యర్ ను మన భారత టీ20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు.ఎలాగో ఊహించుకోండి మరి.ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అయ్యర్, శార్దూల్ ఠాకూర్‌ కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

అలాగే ఈ వీడియోకు రోహిత్ ఒక క్యాప్షన్ కూడా పెట్టారు.సూపర్ గా డాన్స్ చేసావ్.అంతా బాగా జరుగుతుంది అంటూ రాసుకొచ్చాడు.

ఈ వీడియోలో శ్రేయస్‌ ముందు వరసలో వుండి డ్యాన్స్‌ చేయగా, రోహిత్‌, శార్దూల్‌ అతడిని అనుకరిస్తూ వెనుక వరసలో ఉండి స్టైలిష్ స్టెప్పులేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో చుసిన నెటిజన్లు అందరూ తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు