రోహిత్-కోహ్లీ అద్భుతం చేయనున్నారు... కేవలం రెండే రెండు రన్స్?

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 3వ మ్యాచ్‌ చాలా అద్భుతంగా ఆరంభం అయింది.ఇకపోతే ఆసీస్, భారత్‌ జట్లు మొదటి 2 వన్డేల్లో చెరొక విజయం సాధించాయని విషయం అందరికీ తెలిసినదే.

 Rohit-kohli Will Do Wonders  Just Two Two Runs Australia, India, Team India, Cri-TeluguStop.com

కాగా 3 వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా నిలవడం వలన ఈ తాజా మ్యాచ్‌లో ఎవరైతే గెలుస్తారో అదే జట్టు వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.సొంతగడ్డపై గత 26 ఏళ్లుగా ఓటమనేది తెలియని భారత్‌.

ఇప్పుడు కూడా తన జైత్రయాత్రను కొనసాగించాలని పోరాడుతోంది.

Telugu Australia, Cricket, India, Rohit Sharma, Virat Kohli-Latest News - Telugu

3వ వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ( Rohit Sharma ), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.అదేమంటే, రోహిత్-కోహ్లీ జోడి మరో 2 పరుగులు చేస్తే.వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన జంటగా రికార్డు నెలకొల్పనున్నారు.85 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్‌-కోహ్లీ( Virat Kohli ) జోడి ఇప్పటివరకు 4998 పరుగులు చేసిందనే విషయం మీకు తెలిసే ఉంటుంది.కాగా ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో మరో రెండు పరుగులు చేస్తే.

అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు చేసిన జంటగా చరిత్ర సృష్టించనున్నారు.

Telugu Australia, Cricket, India, Rohit Sharma, Virat Kohli-Latest News - Telugu

ఇకపోతే వన్డేల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు చేసిన జోడిగా వెస్టిండీస్‌ జంట గోర్డాన్ గ్రీనిడ్జ్‌-డెస్మండ్‌ హేన్స్‌ పేరిట ఈపాటికే నమోదు కాబడింది.ఇప్పుడు కోహ్లీ, రోహిత్ వంతు వస్తుంది.అదే విధంగా ఆస్ట్రేలియా జంట మాథ్యూ హెడెన్‌-ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ 104 ఇన్నింగ్స్‌లలో 5 వేల రన్స్ చేసి రికార్డ్ నెలకొల్పారు.

రోహిత్‌ శర్మ-విరాట్ కోహ్లీ జోడి మరో రెండు రన్స్ చేస్తే.వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జోడిల రికార్డ్స్ బద్దలు కావడం ఖాయం.ఈ జాబితాలో నాలుగు వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన వారిని పరిగణలోకి తీసుకుంటే.60 కంటే ఎక్కువ యావరేజ్‌ ఉన్న ఏకైక జోడి రోహిత్‌-కోహ్లీ మాత్రమే.ఇక వన్డే క్రికెట్‌లో ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించిన జంట సచిన్‌ టెండూల్కర్-సౌరవ్ గంగూలీలదే( Sachin Tendulkar ) మొత్తంగా చూసుకుంటే మనవాళ్లదే హవా!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube