సీనియర్స్ ఫ్యాషన్ షో ఎపుడైనా చూసారా? వృద్ధుల స్టైల్, ట్రెండీ లుక్స్ చూస్తే అవాక్కవుతారు!

ఫ్యాషన్( Fashion ) అంటే పడిచచ్చే ఈ ప్రపంచంలో ఫ్యాషన్ షోలకు కొదువేమిలేదు.అవును, ఈ సువిశాల ప్రపంచంలో ఎక్కడో ఒకచోట తరచుగా ఫ్యాషన్ షో( Fashion show )లు జరుగుతూనే ఉంటాయి.

 Ever Seen A Seniors Fashion Show? You Will Be Surprised To See The Style And Tre-TeluguStop.com

ఈ షోలో అనేక మంది మోడల్‌లు ర్యాంప్‌పై నడుస్తూ, తమ ప్రతిభను చాటుకోవడానికి ప్రయత్నిస్తారు.ఇలా చిన్నారులు, మహిళలు, పురుషులు కూడా స్టైల్ కు అనుగుణంగా మోడల్స్ గా ఇక్కడ వ్యవహరిస్తూ వుంటారు.

ఈ క్రమంలో మోడల్స్ ఫ్యాషన్ దుస్తులను ధరించి ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ చూపరులు ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటారు.

ఇక ఈ షోలు వివిధ టీవీ మాధ్యమాలద్వారా ప్రసారం కాబడతాయి.కొందరు ఈ ఫ్యాషన్ షోస్ ను ప్రత్యక్షంగా చూడలేకపోయినా టీవీలో చూస్తూ ఆనందిస్తూ వుంటారు.ఇంకా చెప్పాలంటే.

ఈ రోజుల్లో పిల్లల కోసం ఔత్సాహికులుగా కూడా ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నారు.అయితే మీరు ఎప్పుడైనా వృద్ధుల ఫ్యాషన్ షో( Senior Fashion Show ) చూశారా? మీరు విన్నది నిజమే.ఇపుడు వృద్ధులు కూడా క్యాట్‌వాక్ చేస్తున్నారు.ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యంతో పాటు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఓ ఫ్యాషన్ షోలో వృద్ధులు క్యాట్‌వాక్ చేస్తూ.చూపరులను కట్టిపడేసారు.

ఒక నైజీరియన్ చిత్ర నిర్మాత తాజాగా ఓ ప్రత్యేకమైన ఫ్యాషన్ షోను నిర్వహించారు.ఈ షోకు “సీనియర్స్ కోసం ఫ్యాషన్ షో” అని పేరు పెట్టారు.ఇక్కడ వృద్ధుల కొత్త కొత్త గెటప్ లను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.కాగా ఈ సీనియర్స్ ఫ్యాషన్ షోకి చెందిన అద్భుతమైన చిత్రాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయినటువంటి ఇన్‌స్టాగ్రామ్‌ స్లిక్ సిటీ సీఈఓ అనే ఐడితో షేర్ చేయగా ఇప్పటివరకు 87 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.

ఇక నెటిజన్లు అయితే రకరాల కామెంట్లు చేస్తూ వారిని ఆకాశానికెత్తేస్తున్నారు.ఈ ప్రదర్శనలో.వృద్ధులు ఆఫ్రికన్ మూలానికి చెందిన వారుగా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube