రోహిత్-కోహ్లీ అద్భుతం చేయనున్నారు… కేవలం రెండే రెండు రన్స్?

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 3వ మ్యాచ్‌ చాలా అద్భుతంగా ఆరంభం అయింది.

ఇకపోతే ఆసీస్, భారత్‌ జట్లు మొదటి 2 వన్డేల్లో చెరొక విజయం సాధించాయని విషయం అందరికీ తెలిసినదే.

కాగా 3 వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా నిలవడం వలన ఈ తాజా మ్యాచ్‌లో ఎవరైతే గెలుస్తారో అదే జట్టు వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.

సొంతగడ్డపై గత 26 ఏళ్లుగా ఓటమనేది తెలియని భారత్‌.ఇప్పుడు కూడా తన జైత్రయాత్రను కొనసాగించాలని పోరాడుతోంది.

"""/" / ఈ 3వ వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ( Rohit Sharma ), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.

అదేమంటే, రోహిత్-కోహ్లీ జోడి మరో 2 పరుగులు చేస్తే.వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన జంటగా రికార్డు నెలకొల్పనున్నారు.

85 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్‌-కోహ్లీ( Virat Kohli ) జోడి ఇప్పటివరకు 4998 పరుగులు చేసిందనే విషయం మీకు తెలిసే ఉంటుంది.

కాగా ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో మరో రెండు పరుగులు చేస్తే.

అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు చేసిన జంటగా చరిత్ర సృష్టించనున్నారు. """/" / ఇకపోతే వన్డేల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు చేసిన జోడిగా వెస్టిండీస్‌ జంట గోర్డాన్ గ్రీనిడ్జ్‌-డెస్మండ్‌ హేన్స్‌ పేరిట ఈపాటికే నమోదు కాబడింది.

ఇప్పుడు కోహ్లీ, రోహిత్ వంతు వస్తుంది.అదే విధంగా ఆస్ట్రేలియా జంట మాథ్యూ హెడెన్‌-ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ 104 ఇన్నింగ్స్‌లలో 5 వేల రన్స్ చేసి రికార్డ్ నెలకొల్పారు.

రోహిత్‌ శర్మ-విరాట్ కోహ్లీ జోడి మరో రెండు రన్స్ చేస్తే.వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జోడిల రికార్డ్స్ బద్దలు కావడం ఖాయం.

ఈ జాబితాలో నాలుగు వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన వారిని పరిగణలోకి తీసుకుంటే.

60 కంటే ఎక్కువ యావరేజ్‌ ఉన్న ఏకైక జోడి రోహిత్‌-కోహ్లీ మాత్రమే.ఇక వన్డే క్రికెట్‌లో ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించిన జంట సచిన్‌ టెండూల్కర్-సౌరవ్ గంగూలీలదే( Sachin Tendulkar ) మొత్తంగా చూసుకుంటే మనవాళ్లదే హవా!.

అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం వెనక ఎవరు ఉన్నారు…