మండల కేంద్రంలో మడుగును తలపిస్తున్న దారి...!

నల్లగొండ జిల్లా: మునుగోడు మండల కేంద్రంలోని 9వ,వార్డు కూరగాయాల మార్కెట్ వెనుక ఉన్న కాలనీలో ప్రధానరహదారి పాదచారులు కూడా నడవలేని అద్వాన్నస్థితిలో ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్నపాటి చినుకుపడితే చాలు చిత్తడిగా మారి అనేక ఇబ్బందులు పడుతున్నామని,బురద మయం కావడంతో దోమలు, ఈగలు విపరీతంగా వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారినపడే ప్రమాదం ఉందని వాపోతున్నారు.

మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నప్పటికీ పట్టించుకొనే నాథుడే కరువయ్యాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలే జిల్లాలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ రోగాలతో ప్రజలు అల్లాడుతున్న తరుణంలో రహదారి మొత్తం బురద,చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతూ ఉంటే ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఈ రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించండి...!
Advertisement

Latest Nalgonda News