శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ప్రాణాలు కోల్పోయిన తమ కుమారడిని చూడటానికి వెళ్తున్న కుటుంబాన్ని మృత్యువు కబళించింది.

ఎదురుగా నిలబడి ఉన్న కారును ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట జాతీయ రహదారిపై ఓ ప్రమాదం సంభవించింది.

ఒడిశా నుంచి విశాఖకు వెళ్తున్న కారు ఎదురుగా ఉన్న వాహనాన్ని ఢీకొని కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు.మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.విశాఖ షిప్ యార్డ్ ఘటనలో చనిపోయిన కొడుకు కోసం ఒడిశా ఖరగ్ పూర్ చెందిన వారు స్కార్పియో వాహనంలో వెళ్తుండగా.

డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగి ఉంటుంది.నిద్రమత్తులో ఆగి ఉన్న వాహనాన్ని గమనించకపోవడం వల్లే ప్రమాదం సంభవించింది.

ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.ముగ్గురు చికిత్స పొందుతున్నారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.

విజయేంద్ర ప్రసాద్ రాసిన కథను చేంజ్ చేస్తున్న రాజమౌళి....కారణం ఏంటి..?
Advertisement

తాజా వార్తలు