నెల్లూరు జిల్లాలో( Nellore District ) రోడ్డు ప్రమాదం( Road Accident ) జరిగింది.వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద రహదారిపై బైకును ఆటో ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అదుపుతప్పి బైకుపై ఉన్న విద్యార్థులు( Students ) కిందపడగా.వారిపై నుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది.

దీంతో ఇద్దరు విద్యార్థులు ప్రశాంత్,( Prasanth ) పుష్ప( Pushpa ) మృత్యువాత పడ్డారు. విక్రమ సింహపురి యూనివర్సిటీలో పీజీ పరీక్షలు రాసేందుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







