Suryapet : సూర్యాపేట జిల్లా మోతేలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

సూర్యాపేట జిల్లాలోని మోతే( Mothey mandal )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు( RTC bus ) ఢీకొట్టింది.

సూర్యాపేట - ఖమ్మం జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు మృత్యువాతపడ్డారు.

మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.మృతులు మునగాల మండలం( Munagala mandal ) రామసముద్రంకు చెందిన వారిగా తెలుస్తోంది.

ఉదయం కూలీలు మిరప కోతకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని సమాచారం.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
The Foods That Help To Kill Breast Cancer Details

Latest Suryapet News