బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో అంచనా వేయడం చాలా కష్టం.బిగ్ బాస్ లో ఎప్పుడూ అనుకున్న విధంగా పరిస్థితులు ఉండవు.
ప్రేక్షకులు ఒకటి ఊహిస్తే బిగ్ బాస్ లో మరొక విధంగా జరుగుతూ ఉంటుంది.అయితే బిగ్ బాస్ హౌస్ లో బాగా ఆడే వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ వీళ్ళు ఎందుకు ఉన్నార్రా బాబు అనే వాళ్లను సేవ్ చేస్తూ ఉండటం ఎప్పటినుంచో వస్తున్న విషయం తెలిసిందే.
బిగ్ బాస్ లో వాళ్ళకి కావాలి అనుకున్న వాళ్లు మాత్రమే ఆటలో ఉంచి అక్కర్లేదు అనుకున్న వాళ్లను నిర్లక్ష్యంగా బయటికి పంపిస్తూ ఉంటారు.అయితే మొన్నటి వరకు ఎలిమినేషన్ ఈ విషయంలో ప్రేక్షకులు అనుకున్న విధంగానే ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టేవారు.
కానీ బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మాత్రం షో మొదటి నుంచే అడ్డుకోత మొదలైంది.మొదటి వారంలోనే ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
ఇక రెండవ వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయింది.ఇక ఈ వారం ఎలిమినేషన్ లో అనేక అనుమానాలు ఉన్నప్పటికీ మూడవ వారం మాత్రం బిగ్ బాస్ లో షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతోంది అని తెలుస్తోంది.
ఇక మూడవ వారం నామినేషన్ లో భాగంగా మొత్తం 12 మంది ఉన్నారు.హమీద, నటరాజ్ మాస్టర్, అరియానా, బిందు మాధవి, మిత్రశర్మ, శివ, చైతు, తేజస్వి, అజయ్, స్రవంతి, అఖిల్ మహేష్ లు ఉన్నారు.
బిగ్ బాస్ హిస్టరీ లో ఒక వారంలో 12 మంది నామినేట్ కావడం ఇదే తొలిసారి.

సినిమా మొదటి రెండు వారాలలోనే ఎలిమినేట్ అవుతుంది అని ప్రేక్షకులు భావించారు.కానీ ఆమె సేవ్ అవుతూనే వస్తోంది.ఈవారం కూడా నామినేషన్స్ లో ఉండటంతో ఆమె ఎలిమినేట్ కావడం ఖాయం అని అందరూ అనుకున్నారు.
మూడవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఆర్జే చైతు ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు కనుక నిజమైతే బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ ఎలిమినేషన్ అని చెప్పవచ్చు.
మొత్తానికి మూడవ వారం ఆర్జే చైతు బలి కాబోతున్నాడు.







