Rithu Chowdhary: కిచెన్ లో అమ్మ ముందు డ్యాన్స్ వేసిన రీతూ చౌదరి.. నిక్కర్ లో ఆ వేషాలు ఏంటంటూ?

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో రీతు చౌదరి(Rithu Chowdhary) కూడా ఒకరు.ఈమె కెరియర్ మొదట్లో బుల్లితెర కార్యక్రమాలలో నటించారు.

 Rithu Chowdhary Dance Infront Of Her Mother Video Viral-TeluguStop.com

అనంతరం బుల్లితెర షోలలో కూడా సందడి చేశారు.ఇక జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలో కూడా కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.నిజం పొట్టి పొట్టి నిక్కర్లను ధరిస్తూ సోషల్ మీడియాలో ఈమె చేసే హంగామా మామూలుగా ఉండదు.

ఈమె తన స్నేహితురాలు విష్ణు ప్రియతో( Vishnu Priya ) కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తూ ఉంటారు.ఇక ఏ పాటలు అయితే ట్రెండింగ్ లో ఉంటాయో వాటికి రీల్స్( Reels ) చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు .ఇకపోతే ఈమె వస్త్రధారణ కారణంగా పెద్ద ఎత్తున వార్తలో నిలుస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా మరోసారి పొట్టి నిక్కర్ టీషర్ట్ వేసుకొని వంటింట్లో తన తల్లి వంట చేస్తూ ఉండగా ఈమె మాత్రం అక్కడికి వెళ్లి జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు అనే పాటకు డాన్స్ వేస్తూ సందడి చేశారు.

ఈ విధంగా రీతు చౌదరి తన తల్లి ముందుకు వెళ్లి వంట గదిలో డాన్స్ చేస్తూ ఉండగా తన తల్లి(Rithu Chowdhary Mother) మాత్రం ఒక్కసారిగా తనని పక్కకు తోసారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ రీల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.మరి కొంతమంది ఈ వీడియో పై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఎందుకు అలా అమ్మని సంపుకు తింటున్నావు అంటూ కామెంట్ లు చేయగా మరి కొందరు మాత్రం నీ డ్రెస్ ఏంది నీ అవతారం ఏందీ కాస్త మంచి డ్రెస్ వేసుకొని పద్ధతిగా ఉండొచ్చు కదా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా తన వస్త్రధారణ గురించి ఏ విధమైనటువంటి కామెంట్లు వచ్చిన ఈమె మాత్రం వాటిపట్ల పెద్దగా రియాక్ట్ కారు.తనకు నచ్చిన విధంగానే తాను ఉంటానని రీతూ చౌదరి చెప్పకనే చెప్పేస్తున్నారు.ఇక ఈ మధ్యకాలంలో ఈమె పలు బుల్లితెర కార్యక్రమాలతో పాటు స్పెషల్ ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక తన తండ్రి చనిపోయిన తర్వాత రీతు చౌదరి ఎక్కువ సమయం తన తల్లితోనే గడుపుతూ ఉన్నారు.

ఇక తాజాగా షేర్ చేసిన ఈ వీడియో చూడటానికి చాలా ఫన్నీగా కూడా ఉంది అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube