ప్రమాదవశత్తు నిప్పంటుకొని వరి కోయకాలు దగ్ధం

50 ఎకరాల పెట్టు వరి కోయ కాలు దగ్ధం. రైతులకు ( farmers )చెందిన గుడిసె,పైపులు, బోరు మోటారు వైర్లు దగ్ధం.

బారీ అగ్నిప్రమాదం మంటలు అర్పిన అగ్నిమాపక దళం.సమాచారం అందించిన మాజీ ఎంపిటిసి మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది.రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla )ఎల్లారెడ్డిపేట్ మండల కేంద్రంలోని హై స్కూల్ వెనుక గురువారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.

ఈ సంఘటనలో ఎల్లారెడ్డిపేటకు చెందిన బందారపు భానుచందర్ రెడ్డి అనే రైతు కు చెందిన కూరగాయలు పొలము బోరు మోటర్, గుడిసె పైపులు దగ్ధమై సుమారు 10000 వరకు ఆస్తి నష్టం జరిగినట్లు రైతు తెలిపారు.ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన రైతులు, గ్రామ యువకులు ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్ కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

వెంటనే మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu Balaraju Yadav ) ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు.

Advertisement

శనిగరపు రాములు అనే రైతు కు చెందిన సుమారు 10,000 రూపాయల పైపులు కాలిపోయినట్లు రైతు తెలిపారు.అక్కడే ఉన్న రైతులతో మాజీ ఎంపీటీసీ మాట్లాడి జరిగిన నష్టం పై ఆరా తీశారు.

జరిగిన సంఘటన పై మండల తహాసిల్దార్ జయంత్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ కు జరిగిన నష్టముపై మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్ సమాచారం అందించారు.గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ ఓగ్గు రజిత యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.గతంలో కూడా శనిగరపు రాములు అనే రైతుకు చెందిన పవర్ ట్రిలర్,పైపులు,స్ప్రే పంపు కూడా ప్రమాదవశాత్తు ఇదే రకంగా జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్డమై లక్ష యాభై రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందనీ బాధితులను ఆదుకోవాలని సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని అమ్మి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..
Advertisement

Latest Rajanna Sircilla News