వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా కొండా సినిమా ను తెరకెక్కించాడు.వరంగల్ రాజకీయంలో చక్రం తిప్పి రాజకీయ ఉద్దండులుగా నిలిచిన కొండా దంపతులకు సంబంధించిన కథ అవ్వడం తో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ ఈ సినిమా గురించి జరుగుతోంది.
మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొండా సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు.నిజాన్ని ఏమాత్రం మార్చుకుండా జీవిత చరిత్రను దించడమే తనకు తెలుసు అని.ఉన్నది లేనట్లుగా.లేనిది ఉన్నట్లుగా మార్చి చూపించడం లేదా అభూత కల్పనలతో కొత్తగా చూపించే ప్రయత్నాలు చేయడం తనకు చేతనవ్వదు అంటూ వర్మ చెప్పుకొచ్చాడు.
కొండా సినిమా కు సీక్వెల్ మరియు ప్రీక్వెల్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు.కొండా మురళి మరియు సురేఖ లు నాకు బాగా నచ్చారు.అందుకే వారి కథతో సినిమాను చేసినట్లుగా పేర్కొన్నాడు.తెలంగాణ గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను.
భవిష్యత్తులో ఖచ్చితంగా కేసీఆర్ బయోపిక్ కూడా తీస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.వర్మ కేసీఆర్ బయోపిక్ తీస్తాను అంటూ రా రా తీయి అనేవాళ్లు లేరు.

ఇప్పుడు ఆయన కాదు తీస్తా.ఎవరు ఆపుతారో చూస్తాను అంటూ కాస్త వ్యతిరేకంగా తీసినా కూడా కెమెరాలు బద్దలు అవ్వడం.రీల్స్ చిరిగి పోవడం ఖాయం.ఆ విషయం వర్మకు కూడా తెలుసు.అందుకే వర్మ ఆ బయోపిక్ ను తీయాలంటే ఎన్నికలు రావాలి.ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఓడి పోవాలి.
అప్పటి వరకు కేసీఆర్ బయోపిక్ ను వర్మ ముట్టలేడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. వర్మ గతంలో ఎన్నో బయోపిక్ లను తీశాడు.
కాని కేసీఆర్ బయోపిక్ కాస్త అలగ్.వర్మ తోని కాదు అంటూ టీఆర్‌ఎస్ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు.