విజయవాడ గ్యాంగ్ గొడవల ఆధారంగా 1993లో “గాయం” సినిమా( Gaayam Movie ) రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) ఈ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాడు.
ఇందులో జగపతి బాబు, రేవతి, ఊర్మిళ మటోండ్కర్ హీరో హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ సినిమా తీస్తున్న సమయంలో రామ్ గోపాల్ వర్మకి, జగపతి బాబుకు మధ్య గొడవ జరిగిందట.
వీరిద్దరూ మూడు పెగ్గులు తాగిన తర్వాత ఆ వాగ్వాదం చోటు చేసుకుందట.ఊర్మిళ( Urmila ) విషయంలో అది జరిగింది.
ఈ విషయాన్ని తాజాగా జగపతి బాబు తెలిపాడు.

ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నేనూ, ఆయన ఇద్దరూ తిక్కలవాళ్ళం.ఎప్పుడూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటాం.మూడు పెగ్గులు తాగామంటే చాలు మా మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది.
గాయం మూవీ షూటింగ్ సమయంలో ‘ఊర్మిళ అంటే ఇష్టం అని చెప్పు, అప్పుడే రిమైనింగ్ మూవీ షూట్ చేస్తా.లేదంటే సినిమా ఆపేస్తా’ అని అన్నాడు.దాంతో నేను ‘నాకు ఊర్మిళ అంటే ఇష్టం లేదు.’ అని అన్నాను.ఇదే విషయం ఊర్మిళ కి చెప్పాడు ఎందుకు నేనంటే నచ్చదు అని ఆమె అడిగింది తర్వాత అది పెద్ద కన్వర్జేషన్ గా మారింది చివరికి నేను ఊర్మిల అంటే ఇష్టం లేదని డైరెక్ట్ గా చెప్పేసాను”

‘నువ్వు సినిమా ఫినిష్ చేయి చేయకపో.నాకేంటి? లాస్ పోయేది మీరే.నీకు శ్రీదేవి, జయప్రద అంటే ఇష్టం కాబట్టి నాకు వాళ్లు ఇష్టం లేదు, నీకు ఊర్మిళ అంటే ఇష్టం అందుకే ఆమె నాకు నచ్చదు.’ అని అనేసా.నా రివర్స్ మెంటాలిటీ నచ్చి రామ్ గోపాల్ వర్మ శభాష్, ఇదే నాకు కావాలి అన్నాడు.అంతేకాదు మూవీ కంటిన్యూ చేయడానికి ఓకే చెప్పాడు.” అని చెప్పుకొచ్చాడు.ఈ సినిమా చేసేటప్పుడు జగపతి చేతిలో ఏ సినిమాలు కూడా లేవట అయినా సరే జగపతిబాబు( Jagapathi Babu ) చాలా ధైర్యంగా రాంగోపాల్ వర్మ ని ఎదిరించాడు అలాగే మరొక సందర్భంలో రామ్ గోపాల్ వర్మ ని వదిలేసి జగపతిబాబు వేరే వైపుకు వెళ్లాడట.
అప్పుడు “ఆర్జీవీ, ఏంటి ఎక్కడికి వెళ్లావు?” అని జగపతిబాబుని ప్రశ్నించాడట.సిగరెట్ కాల్చడానికి వెళ్లాను అని జగపతిబాబు రిప్లై ఇచ్చాడట.“ఇక్కడ నా ముందు కాల్చొచ్చు కదా.” అని అన్నాడట.” ఆల్రెడీ కాల్చేశా నువ్వంటే బోర్ వచ్చేసింది.అందుకే బయటకి వెళ్ళిపోయా అని జగ్గు భాయ్ చెప్పాడట.“రామ్ గోపాల్ వర్మ అంటే నీకు బోర్ హా అని ఆర్జీవీ ప్రశ్నించాడట.అప్పుడు “నువ్వంటే అందరికీ బోరే ఆ విషయం నీకే తెలియదు.” అని జగపతిబాబు చెప్పడంతో రామ్ గోపాల్ వర్మ షాక్ అయ్యాడట.అయినా వీరిద్దరూ ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు.