తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడటానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర విభజన తరువాత కెసీఆర్ ఎత్తుగడల ముందు కుదేలవడమే కాకుండా అంతర్గత విభేదాలతో పెద్ద ఎత్తున ప్రజల్లో పలుచన కావడంతో గత రెండు దఫాలుగా ఎన్నికలలో ఓటమిని చవి చూస్తూ వచ్చింది.
అయితే ఇక మూడో సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో ఇక కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన స్థానాలను సాధించాలని బలంగా భావిస్తున్న పరిస్థితి ఉంది.అయితే రేవంత్ పార్టీ పటిష్టతకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్ సీనియర్ ల నుండి అంతగా మద్దతు మాత్రం దొరకడం లేదు.
అయితే ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతల వైఖరి పట్ల మొదటి నుండి అసంతృప్తిగా ఉన్న రేవంత్ ఇప్పటికే ఒకసారి హైకమాండ్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఒకసారి కాంగ్రెస్ సీనియర్ లను మందలించినా వారి తీరు మారకపోవడంతో మరొక్క సారి హైకమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు రేవంత్ సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అయితే కెసీఆర్ పై ప్రతిపక్షాలు చాలా కష్టపడి తయారు చేస్తున్న వ్యతిరేకతను రాజకీయ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయంగా మెరుగైన ఫలితాలు సాధించడానికి ఉపయోగించుకోవాలని రేవంత్ చాలా బలంగా భావిస్తున్నారు.

అయితే రేవంత్ కు ఉన్నంత బలమైన లక్ష్యం మిగతానాయకులకు లేకపోవడం వలన మరింతగా కాంగ్రెస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతున్నారు.ఇది ఇలాగే కొనసాగితే ఇక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకరావడం అనేది చాలా కష్టతరమైన విషయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.మరి హైకమాండ్ చొరవ తీసుకొని పార్టీలో సమస్యలను పరిష్కరిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.