నిరాశలో రేవంత్ రెడ్డి... ఇప్పటికే ఆలస్యం అయిందా?

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా రేవంత్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది.పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగా రేవంత్ కు అభిమానులు ఉన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ఒంటి చేత్తో సమర్థవంతంగా నడిపిస్తున్నాడు.కాంగ్రెస్ లో అంతర్గత కలహాల వల్ల దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ చతికిల బడింది.

కాంగ్రెస్ ఇలా ప్రజాదరణ కోల్పోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ నాయకులందరు ఐక్యంగా లేకపోవడం వలన ప్రజల సమస్యల పట్ల పోరాటం చేయకపోవడం వలన ప్రజలు కాంగ్రెస్ ను నమ్మని పరిస్థితి ఉంది.అయితే మరల కాంగ్రెస్ కు పునరుజ్జీవం కల్పించడానికి రేవంత్ రాజీవ్ రైతు భరోసా పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

ఇది ఒకవైపు అయితే తెలంగాణలో త్వరలో పార్టీ ప్రకటన ఉండబోతున్న సంగతి తెలిసిందే.అయితే షర్మిల ముఖ్యంగా ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలపై ఫోకస్ పెట్టనున్న సంగతి తెలిసిందే.

Advertisement

అయితే కాంగ్రెస్ కు వెన్నెముకగా ఉన్న రేవంత్ కు ఇది మింగుడుపడని విషయం.కాంగ్రెస్ లో తనకు భవిష్యత్తు లేదని కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని భావించిన రేవంత్ ఆ నిర్ణయం నుండి వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.

అయితే రేవంత్ కు బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం కొంత షర్మిల వైపు వెళ్తుండడంతో రేవంత్ ఇప్పుడు పార్టీ ఏర్పాటు చేసిన పెద్దగా ఏమీ ప్రయోజనం కనిపించడం లేదు.షర్మిల పార్టీ కంటే ముందుగా నిర్ణయం తీసుకొని ఉంటే కొంత లాభం జరిగి ఉండేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు