55 నెలల్లో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు..: సీఎం జగన్

అల్లూరి జిల్లా చింతపల్లిలో సీఎం జగన్ పర్యటించారు.ఇందులో భాగంగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆయన ట్యాబ్ లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 55 నెలల్లో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని చెప్పారు.రాష్ట్ర భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని చెప్పారు.ట్యాబ్ ల ద్వారా విద్యార్థులకు చదువు సులభతరం అవుతుందని సీఎం జగన్ తెలిపారు.

ట్యాబ్ లలో ఏ సమస్య వచ్చినా గ్రామ సచివాలయంలో ఇవ్వాలన్నారు.వారం రోజుల్లో రిపేర్ చేసిస్తారన్న ఆయన లేదంటే కొత్తది ఇస్తామని పేర్కొన్నారు.ట్యాబ్ ల పంపిణీతో ప్రతి విద్యార్థికీ రూ.33 వేల లబ్ధి చేకూరుతుందని తెలిపారు.నాడు - నేడులో భాగంగా స్కూల్స్ రూపురేఖలు మార్చామన్నారు.

Advertisement

ఇందులో భాగంగా ప్రతీ క్లాసురూంను అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దామని వెల్లడించారు.నాడు -నేడు రెండో దశ పనులు జరుగుతున్నాయన్న సీఎం జగన్ త్వరలోనే పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్...
Advertisement

తాజా వార్తలు