ప్రస్తుతం సోషల్ మీడియా తో అభిమానులలో కూడా పెద్ద చర్చ జరుగుతున్న విషయం రెండు సినిమాలు.అవే సలార్ మరియు డంకీ.
ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల చేయడానికి సన్నాహకాలు చేసుకున్నారు సదరు చిత్రాల మేకర్స్.ఈ రెండు చిత్రాలను ఒకేసారి రిలీజ్ చేయడం అంటే అది మాములు విషయం కాదు.
సినిమాల బలాబలాలు ఎలా ఉన్న, ఈ సినిమాలను డైరెక్ట్ చేసిన దర్శకుల బలాబలాలు మాత్రం మాములుగా లేవు.మరి సలార్( Salar ) మరియు డంకీ( Dunky ) సినిమాలను డైరెక్ట్ చేసిన దర్శకుల సినిమాలు వారి చరిత్ర ఒకసారి పోల్చి చూసే ప్రయత్నం చేద్దాం.

డంకీ
ఈ సినిమాను డైరెక్ట్ చేసింది బాలీవుడ్ లో ప్రముఖంగా వినిపించే రాజ్ కుమార్ హిరానీ( Raj Kumar Hirani ).ఈయన ఒక సినిమాను చేస్తున్నారు అంటే అది వైవిద్యం తో కూడుకున్నది అని జనాలు ఫిక్స్ అయిపోతారు.పైగా రాజ్ కుమార్ కి తీసిన ప్రతి సినిమా కూడా విజయాన్ని ఇచ్చి వంద శాతం సక్సెస్ రేట్ ఉంది.ఇక 2003 నుంచి డైరెక్షన్ చేస్తున్న అయన ఇప్పటి వరకు డంకీ కాకుండా కేవలం ఐదు సినిమాలు మాత్రమే చేసారు.
రాజ్ కుమార్ తీసిన సినిమాల్లో హైయెస్ట్ వర్క్ వైఫ్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ కలెక్షన్స్ పీకే పేరు మీద ఉండగా ఈ చిత్రం 770 కోట్లు కలెక్ట్ చేసింది.ఇక అయన IMDB హైయెస్ట్ రేటింగ్ సంపాదించింది 3 ఇడియట్స్ సినిమాకు కాగా అది 8.4 గా ఉంది.యావరేజ్ గా IMDB రేటింగ్ చూసుకుంటే 8.3 గా ఉంది.డంకీ సినిమా కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది.

సలార్
సలార్ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది ప్రశాంత్ నీల్( Prashanth Neil ).కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి దర్శకుడిగా పరిచయం అయ్యి కెజిఎఫ్ సినిమాల ద్వారా ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ గా అవతారం ఎత్తాడు.2014 లో ఉగ్రం అనే సినిమా తీసిన ప్రశాంత్ ఆ తర్వాత కెజిఎఫ్ రెండు చాఫ్టర్స్ ని తీసి అతి పెద్ద విజయాలను అందుకున్నాడు.ఇక ప్రశాంత్ కెరీర్ లో వరల్డ్ వైడ్ హైయెస్ట్ గ్రాసర్ గా 1215 కోట్లతో కేజిఎఫ్ చాప్టర్ 2 నిలిచింది.ఈ సినిమాకు IMDB హైయెస్ట్ రేటింగ్ 8.3 దక్కింది.ఇక ప్రశాంత్ కెరీర్ IMDB యావరేజ్ 8.2 గా ఉంది.ఇప్పుడు సలార్ సినిమా అతడికి ఎలాంటి విజయాన్ని ఇస్తుందో అని అందరు వెయిట్ చేస్తున్నారు.







