తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి విమర్శల వర్షం కురిపిస్తున్న తరుణంలో తాజాగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో సంచలనం రేపాయి.
అయితే తాజాగా రేవంత్ రెడ్డి కేసీఆర్ ను గద్దె దింపడం పెద్ద విషయమేమీ కాదని వంద మంది ప్రశాంత్ కిషోర్ లు వచ్చినా కెసీఆర్ ఓటమిని ఎవరూ ఆపలేరని వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసీఆర్ అధికారం కోల్పోక తప్పదని ఎలా జరుగుతుందనేది చూడాలని వ్యాఖ్యానించారు.అయితే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పటిష్టంగా మారుతుందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం వందకు వంద శాతం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో కంటే కాస్త బలపడుతున్న పరిస్థితుల్లో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు బలం ఉన్న నియోజకవర్గాలలో బలం నిలుపుకోవడంతో పాటు బలహీన పడ్డ నియోజకవర్గాలలో మరల బలపడటం కొరకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగేలా ఇటు ర్యాలీ లు ధర్నాలతో పాటు సోషల్ మీడియాపై కూడా పూర్తిగా దృష్టి సారించిన పరిస్థితి ఉంది.
అయితే తాజాగా రేవంత్ రెడ్డి తనతో కలిసి రావడానికి సిద్దంగా లేని సీనియర్ లను పక్కన బెట్టి తనదైన వ్యూహాలను అమలుచేస్తూ కాంగ్రెస్ పార్టీని బీజేపీకి గట్టి పోటీగా సిద్దం చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే రానున్న రోజుల్లో కెసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు అడ్డుకుంటారనేది చూడాల్సి ఉంది.
అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం కెసీఆర్ ను తప్పక ఓడిస్తామని ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి ఉంది.







