ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) రాసిన లేఖ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.ఇక ఈ లేఖ నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టడంతో బీఆర్ఎస్ నాయకులకు భయం పట్టుకుంది.
మరి ఇంతకీ రేవంత్ రెడ్డి రాసిన ఆ లేఖలో ఏముంది.ఎందుకు బిఆర్ఎస్ నాయకులు అంతగా భయపడుతున్నారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలో పూర్తిగా దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ లో వెలుగులు నింపారు రేవంత్ రెడ్డి.ఈయన పీసీసీ చీఫ్ అయ్యాక టీ కాంగ్రెసులో ఎన్నో అద్భుతాలు జరిగాయి.
ఈయన ఎంతోమంది కార్యకర్తల్లో కొత్త జోష్ నింపి కాంగ్రెస్ మళ్ళీ పుంజుకునేలా చేశారు.అలా ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ పేరు తెచ్చుకుంది.
అయితే తాజాగా పిసిసి చీఫ్
రేవంత్ రెడ్డి
ఒక లేఖ రాశారు.మరి ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే.
నా ప్రస్థానం జడ్పిటిసిగా మొదలైంది.స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు.
ఈ బిఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధులను పురుగుల కంటే హీనంగా చూశారు కేసీఆర్( KCR ) .మీరు మీ గ్రామాల్లో అభివృద్ధి చేయడం కోసం మీ భార్యల మెడలో పుస్తెలు తాకట్టు పెట్టి అభివృద్ధి చేసినప్పటికీ నిధులు రాక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే మరి కొంత మంది అప్పులు కట్టడం కోసం ఎన్నో పనులు చేస్తున్నారు.కొంతమంది అయితే వాచ్ మెన్ లుగా కూడా డబ్బులు సంపాదిస్తు అప్పులు తీర్చుతున్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు అవమానాలు ఎన్నో జరిగాయి.

ఇక నవంబర్ 30న ఎన్నికలు రాబోతున్నాయి.రాబోయే ఎన్నికల్లో మీ పాత్రే చాలా కీలకమైంది.జెండాలు, ఎజెండాలు,పార్టీలు అన్ని పక్కన పెట్టి మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించండి.కాంగ్రెస్ (Congress) వస్తే రేపటి రోజు మీ కష్టాలు, బాధలు ఇబ్బందులు అన్ని తీరుస్తాము.
స్థానిక సంస్థలకు కాంగ్రెస్ ఎంతో అండగా ఉంటుంది.మీకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి పెడతాము.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి, కెసిఆర్ కి చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి.మీ పుట్టిన పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ మీకు కల్పిస్తుంది.

వార్డ్ మెంబర్ నుండి సర్పంచ్ వరకు,కార్పొరేటర్ నుండి మేయర్ వరకు, కౌన్సిలర్ నుండి మున్సిపల్ చైర్మన్ వరకూ ప్రతి ఒకరికి విజ్ఞప్తి చేస్తున్నాను.అంటూ ఆ లేఖలో రేవంత్ రెడ్డి రాసుకోచ్చారు.ప్రస్తుతం రేవంత్ రెడ్డి ( Revanth reddy ) రాసిన లేఖ వైరల్ అవ్వడంతో చాలామంది బీఆర్ఎస్ నాయకులకి ఎన్నికలు 4-5 రోజులు ఉండగా రేవంత్ రెడ్డి ఇలా షాక్ ఇచ్చారు ఏంటి అని భయపడుతున్నారు.అంతే కాదు రేవంత్ రెడ్డి లేఖలో రాసిన వ్యాఖ్యల వల్ల చాలామంది స్థానిక నేతల్లో ఏదైనా మార్పు వచ్చి బీఆర్ఎస్ కి కాకుండా కాంగ్రెస్ కి మద్దతు ఇస్తారు కావచ్చు అని భావిస్తున్నారు.
మరి చూడాలి రేవంత్ రెడ్డి లేఖ కాంగ్రెస్ కు ఎలాంటి ఫలితం ఇస్తుందో.