తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరీ సభలో ఆయన పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఏం చేసిందన్నది ప్రశ్న కాదన్న రాహుల్ గాంధీ పదేళ్ల పాలనా కాలంలో తెలంగాణకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలన్నారు.రాష్ట్రంలో యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆయన కేసీఆర్ ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు.ధరణి పేరుతో పేదల భూములను సైతం లాక్కున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణలో దొరల సర్కార్ నడుస్తోందన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.2500 వేస్తామని, రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు.అలాగే రైతులకు ఎకరాకు రూ.15 వేలు రైతుభరోసా ఇస్తామని చెప్పారు.ప్రతి మండలంలో ఇంటర్ నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.