ఈ తరానికి చెందిన వాళ్లలో చాలామంది వ్యవసాయంపై( Agriculture ) పెద్దగా దృష్టి పెట్టడం లేదు.అయితే వ్యవసాయం చేస్తూ కూడా కెరీర్ పరంగా సక్సెస్ సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న వాళ్లు ఉన్నారు.
అలా ఆదర్శంగా నిలుస్తున్న వాళ్లలో ప్రసాదరావు( Prasada Rao ) కూడా ఒకరు.ఒకప్పుడు నాగలి పట్టిన ఏగిరెడ్డి ప్రసాదరావు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.
సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ప్రసాదరావు చిన్నప్పటి నుంచి తల్లీదండ్రులు పడుతున్న కష్టాలను దగ్గరుండి చూశారు.
కుటుంబ పరిస్థితుల వల్ల కసిని పెంచుకున్న ప్రసాదరావు క్రమశిక్షణ, నిబద్ధతతో చదివి ఈ స్థాయికి చేరారు.
ఒకప్పుడు నాగలి పట్టి వ్యవసాయం చేసిన ప్రసాదరావు ఇప్పుడు లాఠీ పట్టి సేవ చేస్తున్నారు.విజయనగరంలోని( Vizianagaram ) గుణానుపురం ప్రసాదరావు స్వగ్రామం కాగా నాన్నతో పాటు తాను కూడా పొలం పనులకు వెళ్లేవాడినని ప్రసాదరావు చెప్పుకొచ్చారు.
ప్రభుత్వ పాఠశాలలో( Govt School ) పదో తరగతి వరకు చదివానని ఆయన కామెంట్లు చేశారు.

హైదరాబాద్ లో సివిల్స్( Civils ) కోచింగ్ పూర్తి చేసిన ప్రసాదరావు గ్రూప్స్ లో మంచి ర్యాంక్ సాధించి పోలీస్ శాఖలో చేరారు.2018 బ్యాచ్ లో ప్రసాదరావు డీఎస్పీగా( DSP ) ఎంపికయ్యారు.కడపలోని వేర్వేరు ప్రాంతాలలో ట్రైనీ డీఎస్పీగా ఆయన పని చేశారు.
కడప జిల్లాపై నాకు మంచి అవగాహన ఉందని ప్రసాదరావు కామెంట్లు చేశారు.పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తారని చాలామందిలో అభిప్రాయం ఉందని ఆయన తెలిపారు.

అలాంటి ఆలోచనలను పక్కన పెట్టాలని ప్రసాదరావు ప్రజలకు సూచనలు చేయడం గమనార్హం.ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ కు వచ్చి చెప్పుకుంటే ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపి న్యాయం చేస్తామని ప్రసాదరావు అన్నారు.ప్రజల కోసమే పోలీసులని ఫ్రెండ్లీ పోలీసింగ్ మా విధానమని ప్రసాదరావు కామెంట్లు చేశారు.ప్రసాదరావు చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.







