తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ సిట్ కార్యాలయానికి చేరుకోనున్నారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో చేసిన ఆరోపణలపై తన దగ్గరున్న ఆధారాలను రేవంత్ రెడ్డి సిట్ అధికారులకు ఇవ్వనున్నారు.
అదేవిధంగా రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ ను కూడా సిట్ అధికారులు రికార్డ్ చేయనున్నారు.మరోవైపు సిట్ విచారణ సందర్భంగా కార్యాలయానికి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో పాటు సిట్ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.దీంతో సిట్ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.