డ్రగ్స్ కేసులో నీ బావ లేడా..కేటిఆర్ కి సవాల్

తెలంగాణా ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి.మళ్ళీ ఫైర్ అయ్యాడు.

మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న రేవంత్ ఇప్పుడు ఒకేసారి అధికారపక్షం మీద ఫైర్ అవ్వడంతో ఇక కాంగేస్స్ కి తన హస్తం ఇచ్చినట్టే అని ఫిక్స్ అయ్యింది.ఇక ఫుల్ జోష్ ఉంటాను అన్నట్టుగా రేవంత్ ఇప్పుడు చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద దాడి చేస్తాడు అని భావించినా అనూహ్యంగా.అధికారపక్షం వైపు తన దృష్టి పడింది.

ముందుగా ఎవరిని టార్గెట్ చేస్తాడా అని అనుకున్నారు అందరు.కేసీఆర్ నే ముందుగా టార్గెట్ చేసి మాట్లాడుతాడు అనుకున్నారు మరి కొందరు .కానీ.రేవంత్ డైరెక్ట్ ఎటాక్ కేసీఆర్ తనయుడు.

Advertisement

తెలంగాణా ఐటీ మంత్రి కేటిఆర్ ని టార్గెట్ చేసేశాడు.ఇది ఊహించని పరిణామం.

ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది.శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.

రాష్ట్ర మంత్రి కే.తారకరామారావుకు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందనే అనుమానం ఉందని రేవంత్ అనడంతో అందరు కంఘుతిన్నారు.తెలంగాణలో ఈ మధ్య సంచలనం క్రియేట్ చేసిన డ్రగ్స్ మాఫియాపై ఈడీ విచారణ జరిపించాలన్నారు.

దీనిపై తాను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండానే సభను వాయిదా వేశారన్నారు.అంతేకాదు మరొక సంచలన కామెంట్స్ చేస్తూ టీఆరెస్ ప్రభుత్వానికే సవాలు విసిరారు.కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయని, ఇది నిజం నిరాధార ఆరోపణలు నేను చేయడం లేదు .పూర్తి ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నా.దమ్ముంటే నాపై కేసు పెట్టండి అని రేవంత్‌రెడ్డి అన్నారు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
ఢిల్లీ లో బాబు బిజీ బిజీ.. వీరందరితోనూ భేటీ 

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు డ్రగ్స్ విషయంలో ఫిర్యాదు చేశానని.దీనిపై సమగ్ర విచారణ కి ఆదేసించి చర్యలు తీసుకోవలసినడిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

Advertisement

మరి రేవంత్ ఇచ్చిన ఈ షాక్ తో కేటిఆర్ ఎలాంటి సమాధానం ఇస్తారో.వేచి చూడాలి .

తాజా వార్తలు