స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటం తెలిసిందే.ఈ క్రమంలో చంద్రబాబుకి బెయిల్ తీసుకురావడానికి తెలుగుదేశం నేతలు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్టు కావటం పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy )స్పందించారు.చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఒక రాష్ట్రానికి పరిమితమైనది కాదు.
ఆయన ఓ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు జాతీయస్థాయిలో ప్రభావం చూపించే వ్యక్తి.
అటువంటి వ్యక్తి అరెస్టు గురించి నిరసనలు తెలుపుతూ అందుకు అనుమతి ఇవ్వాలి.
కానీ అడ్డుకుంటే ఎలా.? ఆంధ్ర ప్రాంతానికి చెందిన కమ్మవారి ఓట్లు కావాలి కానీ వారికి నిరసనలు తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు.అదేవిధంగా చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) తెలంగాణకు సంబంధం లేదు అనుకుంటే తెలంగాణ ఉద్యమం సమయంలో అమెరికాలో వైట్ హౌస్ ముందు ఎందుకు నిరసనలు తెలిపారు.? నిరసనలు తెలిపే వారిని అడ్డుకుంటే ఈసారి బీఆర్ఎస్ పార్టీ( BRS party ) చెంపలు వాయిస్తారు.ఈసారి జరగబోయే ఎన్నికలలో ఆంధ్ర సెటిలర్స్ బీఆర్ఎస్ పార్టీకి వాతలు పెడతారని రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.