చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన రేవంత్ రెడ్డి..!!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటం తెలిసిందే.

ఈ క్రమంలో చంద్రబాబుకి బెయిల్ తీసుకురావడానికి తెలుగుదేశం నేతలు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్టు కావటం పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy )స్పందించారు.

చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఒక రాష్ట్రానికి పరిమితమైనది కాదు.ఆయన ఓ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు జాతీయస్థాయిలో ప్రభావం చూపించే వ్యక్తి.

అటువంటి వ్యక్తి అరెస్టు గురించి నిరసనలు తెలుపుతూ అందుకు అనుమతి ఇవ్వాలి.కానీ అడ్డుకుంటే ఎలా.

? ఆంధ్ర ప్రాంతానికి చెందిన కమ్మవారి ఓట్లు కావాలి కానీ వారికి నిరసనలు తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు.

అదేవిధంగా చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) తెలంగాణకు సంబంధం లేదు అనుకుంటే తెలంగాణ ఉద్యమం సమయంలో అమెరికాలో వైట్ హౌస్ ముందు ఎందుకు నిరసనలు తెలిపారు.

? నిరసనలు తెలిపే వారిని అడ్డుకుంటే ఈసారి బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) చెంపలు వాయిస్తారు.

ఈసారి జరగబోయే ఎన్నికలలో ఆంధ్ర సెటిలర్స్ బీఆర్ఎస్ పార్టీకి వాతలు పెడతారని రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.