ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీచేసిన ఘనత రేవంత్ రెడ్డి దే

హారిష్ రావు రాజీనామా చేస్తా అన్నావు రాజీనామా చేయ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా: ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి కే దక్కుతుందని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ భాయి పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం పాలాభిషేకం చేశారు అనంతరం స్వీట్లు పంచుకున్నారు, టపాసులు పేల్చీ సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సభ్యుల సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రెండు లక్షల రూపాయల రుణమాఫీ పంద్రాగస్టులోగా చేస్తే రాజనామా చేస్తా అని అన్నావు మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే రాజీనామా చేయి మాట నిలబెట్టుకో అని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.మీరు మాట నిలబెట్టుకోలేని మనుషులని మాకు ప్రజలకు తెలుసు దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి ఇస్తా అన్నావ్ ఇవ్వలేదు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తా అన్నావ్ కట్టించలేదు దళితులను ముఖ్యమంత్రి చేస్తాను అన్నావు చేయలేదు మీరు మాట తప్పే మనుషులేనని మాకు తెలుసు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని 10 సంవత్సరాలైనా ఇవ్వలేదు అది గుర్తుపెట్టుకో పని ఆయన తీవ్రంగా విమర్శించారు.

దేశంలో ఈ ముఖ్యమంత్రి చేయలేని సాహసోపేతమైన చరితాత్మకమైన నిర్ణయం తీసుకొని ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల పక్షపాతి అయ్యారని అన్నారు.బ్యాంకు అధికారుల వ్యవసాయ అధికారుల పొరపాటు వల్ల రుణమాఫీ జరగకపోతే అట్టి రైతులు వ్యవసాయ అధికారులు బ్యాంకు అధికారులను గాని కాంగ్రెస్ పార్టీ నాయకులను గానీ కలిస్తే రుణమాపి చేసి తీరుతామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ బాయి పాల్గొని ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు ఏలూరి రాజయ్య, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు , జిల్లా నాయకులు బాలఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్ , యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బానోతు రాజు నాయక్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు రఫీక్, బీసీ సెల్ మండల అధ్యక్షులు రవి , కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి , గుండాడి రాంరెడ్డి, గుర్రం రాములు , గంట బుచ్చా గౌడు , దండు శ్రీనివాస్ ముదిరాజ్ , మెండే శ్రీనివాస్ యాదవ్ , గంట కార్తీ గౌడ్ , గుండారం లక్ష్మణ్ ముదిరాజ్ , సిరిపురం మహేందర్ , ఉప్పుల రవి , గన్నరాజు రెడ్డి , వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఉత్తమ ప్రశాంశ పత్రాలు అందుకున్న ఎల్లారెడ్డిపేట పోలీస్ అధికారులు

Latest Rajanna Sircilla News