టి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ? అధికారిక ప్రకటన ఎప్పుడంటే ?

అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ గా ఉండే కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నాయకులకు కొదవే లేదు.

ఎవరికి వారు తామే సీనియర్ నాయకులమని, అధిష్టానం అండ దండలు తమకే ఉన్నాయని తరచుగా చెప్పుకుంటూ, ఎవరికి వారు తమ సొంత అజెండాతో ముందుకు వెళ్తూ ఉంటారు.

అలాగే గ్రూపు రాజకీయాల కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చింది.అధికార పార్టీ టిఆర్ఎస్ దూకుడుగా ముందుకు వెళుతూ, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే విషయాన్ని పక్కనపెట్టి కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష పీఠంపై దృష్టిపెట్టి ఒకరిపై ఒకరు సొంత నేతలపైన విమర్శలు చేసుకుంటూ ముందుకు వెళుతున్న తీరు అనేక విమర్శలకు తావిస్తోంది.

ఇదే అదునుగా అధికార పార్టీ టిఆర్ఎస్ మరింత బలం పెంచుకుంటూ, ముందుకు వెళ్తుండగా, బీజేపీ కూడా ఈ మధ్యకాలంలో బాగా బలపడినట్టు గా కనిపిస్తోంది.ఈ పరిణామాలన్నింటినీ గమనించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిసిసి అధ్యక్ష పీఠాన్ని అతి తొందర్లోనే భర్తీ చేయాలని కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే అనేకమంది తాము రేసులో ఉన్నామనే సంకేతాలు పంపించినా, ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పైనే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.ఆయన అయితేనే పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లడం తో పాటు, తమ ప్రధాన ప్రత్యర్థి టిఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొంటూ పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అయితే ఈ విషయంలో కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వొద్దు అని, ఎవరికీ అభ్యంతరం లేదని చెబుతున్నా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ పైనే ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కేటీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారంలో రేవంత్ దూకుడుగా ముందుకు వెళ్లడంలో అధికారపార్టీని ఇబ్బందులు పెట్టడం లో రేవంత్ వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చినట్టుగా కనిపించిందని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, ప్రస్తుత పరిస్థితిని బట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లే నేతలు ఎవరూ లేరనే అభిప్రాయంతో ఆయనకు తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు సిద్ధమవుతోంది.ఈ మేరకు మరో కొద్దిరోజుల్లోనే అధికారికంగా ప్రకటన విడుదల చేయబోతున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు