మహారాష్ట్ర కు చెందిన శరత్ మర్కట్( Sarat Market ) అనే వ్యక్తి ఇటీవలే కేసీఆర్( KCR ) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.అయితే అలా చేరిన కొద్ది రోజులకే ఆయనను సీఎంవోలోకి తీసుకుని ప్రైవేట్ సెక్రటరీగా కేసీఆర్ నియమించారు.
దీంతో పాటు నెలకు లక్షన్నర వేతనం కూడా నిర్ణయించారు.అయితే దీనికి సంబంధించిన జీవోను రహస్యంగా ఉంచడంపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
బి ఆర్ ఎస్ ను విస్తరించేందుకు ప్రజాధనాన్ని ఈ విధంగా కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని, రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రజాధనంతో పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకునేందుకు అక్కడి మనుషులను తెచ్చుకుని ఇక్కడ కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసీఆర్ కొత్త ప్రైవేట్ సెక్రటరీని మహారాష్ట్ర నుంచి తెచ్చుకున్నారని, ఆ జీవోను రహస్యంగా ఉంచారని, ప్రజల సొమ్ముతో ఏడాదికి 18 లక్షల వేతనం ఇస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

” సాఫ్ట్వేర్ ఉద్యోగి శరత్ మర్కట్ బీఆర్ఎస్ లో చేరారని పత్రికల్లో వచ్చింది.శరత్ మర్కట్ కు సీఎం ఓలో ప్రైవేట్ సెక్రటరీగా నియమించారు.పార్టీలో చేరిన 20 రోజులకే లక్షన్నర వేతనంతో నియమించారు.ఉద్యోగాలు లేక యువత అల్లాడుతుంటే, ఇలాంటి నియామకాల అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.పక్క రాష్ట్రం వారిని తీసుకువచ్చి అడ్డగోలుగా ఉద్యోగాలు ఇస్తారా అని కేసిఆర్ పై రేవంత్ ఫైర్ అయ్యారు.బీఆర్ఎస్( BRS ) పార్టీ కార్యక్రమాల కోసం తెలంగాణ ప్రజాధనాన్ని ఈ విధంగా ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.
అసలు మహారాష్ట్రకు చెందినవారు బీఆర్ఎస్ లో చేరుతున్నారనేది ఒక నాటకమని, కిరాయి మనుషులను రప్పించి రోజుకో వేషం వేయించి పార్టీలో చేర్చుకుంటున్నారని రేవంత్ సెటైర్లు వేశారు.తెలంగాణలోని నిరుద్యోగ సమస్యలను పట్టించుకోవడంలేదని, రైతులు నష్టపోతే కనీసం ఆదుకోవడం లేదని, కేసీఆర్ రాజకీయాల మీద మాత్రమే దృష్టి పెట్టారని రేవంత్ విమర్శించారు.







