టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు వస్తున్నారని విమర్శించారు.
రాజకీయ పబ్బం గడుపుకునేందుకే పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.అమరావతి భూ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు.
ఆర్థిక నేరగాళ్లకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.అంతేకాకుండా ఖాతాదారుల సొమ్మును ఆదిరెడ్డి అప్పారావు కాజేశారని ఆరోపించారు.







