ఇండియాకి తిరిగొచ్చిన భువన్ జై… అత్యంత ఎత్తైన పర్వత శిఖరం అధిరోహించి బుడ్డోడు.యూరప్ లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎల్ర్బస్ ను అధిరోహించి ప్రపంచ రికార్డు స్థాపించిన గంధం భువన్ జై ఇండియాకు తిరిగి వచ్చాడు.
ఈనెల 18న అతి చిన్న వయసులోనే అరుదైన ప్రపంచ రికార్డు సాధించి తిరిగొచ్చిన భువన్ జై ను పలువురు అభినందించారు.సీనియర్ ఐఏఎస్ అధికారి మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు కుమారుడు భువన్ జై.
కర్నూల్ జిల్లాలో మూడో తరగతి చదువుతూ.పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు.
చిన్నప్పటి నుంచే భువన్ జై ఆసక్తిని గమనించి గంధం చంద్రుడు తదనుగుణంగా ప్రోత్సహించారు.అనంతపురం జిల్లా ఆర్డీటీ కోచ్ శంకరయ్య నేతృత్వంలో కడప జిల్లా గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ లో శిక్షణ పొందాడు.
భువనగిరిలోని ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ కోచ్ శంకర్ బాబు వద్ద పర్వతారోహణ లోని మెళుకువలు నేర్చుకున్నారు.మౌంట్ ఎల్ర్బస్ పర్వతాన్ని అధిరోహించే ఎందుకు ఈ నెల 11న భారత్ నుంచి రష్యా వెళ్ళాడు.
అక్కడి నుంచి 12న టెర్స్ కోల్ మౌంట్ ఎల్ర్బస్ బేస్ కు చేరుకున్నాడు.
అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈనెల 13న 3,500 కిలోమీటర్లు అధిరోహించి తిరిగి బేస్ క్యాంపుకు చేరుకున్న భువన్ జై ఈ నెల 13 న క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను అధిగమిస్తూ 5,642 కిలోమీటర్లు అధిరోహించి రికార్డు సాధించాడు.శుక్రవారం రాత్రి సురక్షితంగాను.ఆరోగ్యంగానూ.
భారత్ తిరిగి వచ్చిన భువన్ జై కి పలువురు అభినందనలు తెలిపారు.ఈ విజయం సాధించారంటూ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి గంధం చంద్రుడు ఆనందం వ్యక్తం చేశారు.