జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ..

ఏలూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) బహిరంగ సభలో ప్రసంగిస్తూ వాలంటీర్లు సంఘవిద్రోహ శక్తులుగా మారారని వ్యాఖ్యానించడంపై మహిళా సంఘాలు, మరియు వాలంటీర్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి కు పద్మ సోమవారం కమీషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పది రోజుల్లో ఆయనే స్వయంగా గాని ఆయన ప్రతినిధి ద్వారా గాని సమాధానం చెప్పాలని అందుకు సంబంధించిన ఆధారాలు తెలియజేయాలని నోటీసులు జారీ చేస్తున్నామని తెలియజేశారు.

 Responding To Jana Sena Chief Pawan Kalyan's Comments, Chairperson Of Women's C-TeluguStop.com

ఆధారాలు లేకుండా పవన్ కళ్యాణ్ వాఖ్యానించటం సమంజసం కాదన్నారు, ఆయన మహిళల, ఒంటరి మహిళల భధ్రతపై బీతి కలిగేలా వారిని అవమానపరిచేలా మాట్లాడారని తనకు కేంద్ర ఇంటెలిజెన్స్( Intelligence ) విభాగం వివరాలు ఇచ్చారని అది సమాజానికి తెలియాలని ఉద్దేశంతోనే చెబుతున్నానని అన్నారు, ఆ విషయాలు దానికి సంబంధించిన ఆధారాలు ముఫ్ఫైవేల మంది అదృశమయిన మహిళల లెక్కలు బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేసారు.మహిళల మిస్సింగ్ కేసు నమోదైన కేసుల్లో వారిని వారి ఇళ్ళకు చేర్చిన అంశంలో పోలీసు వారు 96% సక్సెస్ అయ్యారని తెలియజేసారు.

పవన్ ఇలా వ్యాఖ్యానించటం వెనుక ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగమే అన్నారు.ప్రేమల పేరుతో తీసే సినిమాల ప్రభావం టీనేజ్ అమ్మాయిల మిస్సింగ్ కి కారణం కాదా? హ్యూమన్ ట్రాఫికింగ్ పై సినిమా రంగానికి బాధ్యత లేదా దీనికి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube