ఎప్పుడూ ఏదో ఒక వివాదం లో చిక్కుకోవడమో, వివాదాలు సృష్టించడమో చేస్తూ, నిత్యం వార్తల్లో ఉంటూ ఉంటారు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ( Ramgopal varma, ).చాలా కాలంగా వైసీపీకి అనుకూలంగా, టిడిపి, జనసేనకు వ్యతిరేకంగా వివాదాస్పద కామెంట్స్ చేస్తున్న వర్మ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన విమర్శలు చేశారు.పవన్ చేపట్టిన వారాహి యాత్ర రెండో దశలో భాగంగా ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ జనసేన అనేక ఆరోపణలు చేశారు.” వాలంటీర్లు ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి ? ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ? వితంతువులు ఉన్నారా లేదా ? ప్రధానంగా ఒంటరి మహిళలే లక్ష్యంగా వివరాలను సేకరించి సంఘ విగ్రహ శక్తులకు చేరవేస్తున్నారు.వాలంటీర్లు హ్యుమన్ ట్రాపింగ్ కి పాల్పడుతున్నారు.” అంటూ పవన్ సంచల విమర్శలు చేయగా, దీనిపై రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా స్పందించారు .

” వైసిపి ప్రభుత్వం మహిళల ట్రాపింగ్ చేస్తోంది అనే పవన్ కళ్యాణ్ ఆరోపణ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు ఎవరినైనా చేసి ఉండరు.సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర ఈ విషయం మీద ఆధారాలు ఉంటే యాక్షన్ తీసుకోకుండా పీకే చెవిలో ఎందుకు చెప్పారు ? ప్రజల కోసం పనిచేసే వైసీపీ వాలంటీర్లను( volanteers ) పవన్ కళ్యాణ్ అమ్మాయిల బ్రోకర్ అన్నాడు.అంత నీచాతి నీచంగా, అసహ్యంగా వర్ణించబడ్డ ఆ వాలంటీర్లకు సిగ్గు, శరం, ఆత్మ అభిమానం ఉంటే వెంటనే వాళ్ళు పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసులు పెట్టాలి.పెట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి మొహాలు ఎలా చూపెట్టగలరు ” అంటూ రాంగోపాల్ వర్మ వాలంటీర్లను ప్రశ్నించారు.

సోషల్ మీడియా ద్వారా వాలంటీర్లను పవన్ కళ్యాణ్( pavan kalyan ) పై రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇక అధికార పార్టీ వైసీపీ కూడా ఈ విషయం లో వాలంటీర్ల ద్వారానే పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు వాలంటీర్ల వ్యవస్థను మెచ్చుకుంటూ తమ తమ రాష్ట్రాల్లో ఈ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్న తాము గెలిచిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని ప్రకటనలు చేస్తుండగా, పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విధంగా వ్యాఖ్యానించడం పెద్ద దుమారమే రేపుతోంది.పవన్ వ్యాఖ్యలకు నిరసన తెలిపే విధంగా వాలంటీర్లంతా ఆందోళన.
కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.







