ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది.మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు పార్టీకి రాజీనామా చేశారని తెలుస్తోంది.
వైరా పట్టణ అధ్యక్షుడు దార్నా రాజశేఖర్ తో పాటు ముగ్గురు వార్డు కౌన్సిలర్లు, ఐదుగురు వార్డు కమిటీ అధ్యక్షులు బీఆర్ఎస్ ను వీడినట్లు సమాచారం.అయితే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ తీరుపై పొంగులేటి తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
అంతేకాకుండా ఆయన త్వరలోనే బీఆర్ఎస్ ను వీడి వేరే పార్టీలో చేరతారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.తాజాగా పొంగులేటి వర్గీయుల రాజీనామాతో ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.







