కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఈనెల 12వ తేదీలోపు పూర్తి కానుందని తెలుస్తోంది.కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ రాష్ట్రపతిభవన్ లో జరగనుంది.
అయితే రాష్ట్రాల పర్యటనను పూర్తి చేసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఢిల్లీకి చేరుకోనున్నారు.ఇప్పటికే కేంద్ర కేబినెట్ లో మార్పులకు కసరత్తు పూర్తి అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఫైనల్ లిస్ట్ ను ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు సిద్ధం చేశారు.గుజరాత్, యూపీ, ఒడిశా సహా పలు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులను కేబినెట్ నుంచి అధిష్టానం తప్పించనుంది.
ఇందులో భాగంగా 15 నుంచి 20 మంది కేంద్ర మంత్రులను తొలగించే అవకాశం ఉంది.ధరేంద్ర ప్రదాన్, గజేంద్ర సింగ్ షెకావత్, జితేంద్ర సింగ్, భూపేంద్ర యాదవ్, నరేంద్ర సింగ్ తోమర్, మన్సుక్ మాండవీయ, మురళీధరన్, కిషన్ రెడ్డికి ఉద్వాసన పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, బీహార్, మహారాష్ట్ర నుంచి కొత్తవారికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారని సమాచారం.అదేవిధంగా శివసేన, ఎన్సీపీ, లోక్ జనశక్తి పార్టీలకు ప్రాధాన్యత కల్పించే ఛాన్స్ ఉంది.
ఈ క్రమంలో తెలంగాణ నుంచి కేబినెట్ లో స్థానంపై ఉత్కంఠ నెలకొంది.