తెలంగాణ లో ఇప్పుడు గవర్నర్ తమిళ సై కు.ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావుకు.
పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే గొడవలు నడుస్తూ ఉన్నాయి.సందర్భం వచ్చిన ప్రతి సారి.
ఇద్దరు కత్తులు దూసుకుంటు ఉన్నారు.అసెంబ్లీ లో తీర్మానం చేసిన కొన్ని బిల్లులను గవర్నర్ ఆపేసి.
వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.దాంతో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తో పాటు సంబంధిత శాఖల మంత్రులు గవర్నర్ అధికారిక నివాసం అయిన రాజ భవన్ బాట పట్టారు.
అప్పటికి కూడా గవర్నర్ శంతించ లేదు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా దర్బార్ పెట్టీ మరి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
ఇక వరదల టైమ్ లో ఏకంగా అధికారిక పర్యటన చేసి.ప్రజలతో మాట్లాడారు.
ప్రతి విషయానికి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.దాంతో కెసిఆర్ కు రాజ్ భవన్ కు మధ్య గ్యాప్ పెరిగింది.

సీఎం కెసిఆర్ అయితే ఏకంగా.అసెంబ్లీ సంప్రదాయాన్ని పక్కన పెట్టీ.సమావేశాలను జరిపించారు.గవర్నర్ ప్రసంగం లేకుండా నే చర్చలు చేశారు.అంతే కాకుండా గవర్నర్ కు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు.గవర్నర్ అధికారిక పర్యటనలు చేసే టప్పుడు మత్రులను ఆ దిక్కు కూడా పోకుండా అడ్డుకున్నారు.
కేవలం అధికారుల సహాయం తో గవర్నర్ తన పర్యటనలు ముగించారు.

ఇప్పుడు అలాంటి మరో సందర్భం వచ్చింది.అదే రిపబ్లిక్ డే.గవర్నర్, ముఖ్యమంత్రి సమక్షం లో జరగాల్సిన.దినోత్సవం ఈ సారి ఎన్ని రచ్చలకు సారి తెస్తుంది అనేది అర్థం కావడం లేదు.అసెంబ్లీ మాదిరి గా గవర్నర్ ను పిలవ కుండా రిపబ్లిక్ డే నిర్వ హిస్తే అది పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది.
గవర్నర్ ఇప్పటి వరకు తనకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు.మరి నిజంగా అదే జరిగితే.అది జాతీయ స్థాయిలో చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.సీఎం కెసిఆర్ కూడా అదే కోరుకుంటూ ఉన్నట్టు తెలుస్తోంది.
చూడాలి ఈ సారి రిపబ్లిక్ ఎన్ని వివాదాలకు వేదిక అవుతుందో.







