చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్ గా దక్షిణాది సిని ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి కీర్తి సురేష్ ఒకరు.ఈమె ఎన్నో అద్భుతమైన పాత్రలను ఎంపిక చేసుకొని గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ఎన్నో అద్భుతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాల ద్వారా కూడా కీర్తి సురేష్ తన నటనతో అందరిని మెప్పించారు.సౌత్ ఇండస్ట్రీలో కన్నడ భాషలో మినహా అన్ని భాషలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం నాని హీరోగా నటించిన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ సినిమా మార్చ్ 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమా తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడంతో చిత్ర బృందానికి కీర్తి సురేష్ సర్ప్రైజ్ ఇచ్చారు.సింగరేణి బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నాని కీర్తి సురేష్ డీ గ్లామర్ పాత్రలో సందడి చేయనున్నారు.

గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోనుండగా చివరి రోజు షూటింగ్లో భాగంగా కీర్తి సురేష్ ఈ చిత్రానికి పని చేసినటువంటి 130 మంది సినీ కార్మికులకు ఒక్కొక్కరికి రెండు గ్రాముల బంగారపు కాయిన్స్ కానుకగా ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేశారు.ఇలా అందరికీ గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం కోసం కీర్తి సురేష్ సుమారుగా 13 లక్షలకు పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.ఇలా కీర్తి సురేష్ చిత్ర బృందానికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చి తన బంగారు మనసును చాటుకున్నారు.అయితే ఇదివరకు ఈమె మహానటి పందెంకోడి 2 యూనిట్ సభ్యులకు కూడా ఇలా బంగారపు కాయిన్స్ ఇవ్వడం విశేషం.







