అమెరికాలో భారత సంతతి మహిళ రేణూ ఖాటోర్ ప్రఖ్యాత అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (AAAS) కి ఎంపికై చరిత్ర సృష్టించారు.అమెరికాలోని హోస్టన్ యూనివర్సిటీ సిస్టమ్ చాన్సలర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఈ గౌరవానికి ఎంపిక కావడం భారతీయులు అందరూ గర్వించదగ్గ విషయమని ఎన్నారైలు అంటున్నారు.
ఇంతకీ రేణూ ఖాటోర్ ఈ గౌరవానికి ఎంపిక కావడానికి కారణం ఏమిటి అనే వివరాలోకి వెళ్తే.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఖాటోర్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళారు.
చదువు పూర్తికాగానే అక్కడే ఉద్యోగం రావడంతో అమెరికాలోనే స్థిరపడిపోయారు.ప్రస్తుతం ఆమె హోస్టన్ యూనివర్సిటీ సిస్టమ్ చాన్సలర్ గా పనిచేస్తున్నారు.విద్యారంగానికి ఆమె అందించిన సేవలకి గాను ఆమెకి ఈ గుర్తింపు లభించింది.2020 కి గాను ఈ అవార్డ్ కి ఎంపిక చేసిన శాస్త్రవేత్తలతో పాటు నన్ను కూడా ఎంపిక చేసి గౌరవించడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఈ గౌరవంతో ప్రపంచంలోనే అత్యంత ప్రముఖుల పక్కన నేను ఉండటం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు.వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ఎంతో మంది గొప్ప గొప్ప వారిని గౌరవించుకోవాలనే ఆశయంతో 1780లో ఈ అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్థాపించబడిందని ఇలాంటి వారు భావిష్యత్ తరాల వారికి ఎంతో ఆదర్శంగా నిలుస్తారని నిర్వాహకులు తెలిపారు.
ఇదిలాఉంటే భారత సంతతి మహిళగా ఖాటోర్ ఈ గౌరవాని స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రవాస భారతీయులు అంటున్నారు.