పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) హీరోగా తాజాగా తాజా చిత్రం ప్రాజెక్ట్ కే.( Project K ) ఈ సినిమాలో దీపికా పదుకొనే( Deepika Padukone ) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
వై జయంతి మూవీస్ బ్యానర్లో ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.దాదాపు 500 కోట్లకుపైగా బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
కాగా ఇందులో అమితాబ్ బచ్చన్,( Amitabh Bachchan ) కమల్ హాసన్( Kamal Haasan ) వంటి అగ్ర హీరోలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.కాగా ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకున్న డైరెక్టర్ ఈ సినిమాను హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా రూపొందిస్తున్నారు.ఈ సినిమా నుంచి తరచూ ఏదో ఒక అప్డేట్ ని విడుదల చేస్తూ అంచనాలను మరింత పెంచుతున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాలో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో నటించేందుకు గాను ప్రభాస్ దగ్గరినుంచి కీలక పాత్రధారుల వరకు పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారట.
కేవలం నటీనటుల రెమ్యూనరేషన్ కోసం మాత్రమే 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట.మరి ఏ సెలబ్రిటీ ఎంత పారితోషికాన్ని అందుకున్నారు అన్న విషయానికి.ప్రభాస్ ప్రాజెక్ట్ కే కోసం రూ.150 కోట్ల తీసుకున్నారట.బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే రూ.10 కోట్ల అందుకుందట.కమల్ హాసన్ ఏకంగా రూ.20 కోట్ల తీసుకున్నారట.అమితాబ్ బచ్చన్ రూ.15 కోట్ల అందుకున్నారట.అలాగే హీరోయిన్ దిశా పఠానీ 5 కోట్ల రూపాయలు తీసుకున్నారట.ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వామ్మో ఏకంగా అన్ని కోట్లా అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు.