CM Revanth Reddy : పాత పరిచయాలు గుర్తు చేస్తూ.. రేవంత్ కు దగ్గరవుతున్న మాజీ ‘తమ్ముళ్లు ‘

ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ లో వలస జోరు ఎక్కువైంది.ముఖాయంగా బీఆర్ఎస్ నుంచి చాలామంది కీలక నేతలే కాంగ్రెస్ లో చేరుతున్నారు.

 Reminiscing Old Acquaintances Former Tdp Leaders Approaching Revanth Reddy-TeluguStop.com

నియోజకవర్గ స్థాయి నేతలతో పాటు, మండల, గ్రామస్థాయి నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నారు.ఆ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండడంతో, ఇతర పార్టీల్లోని నేతలు చాలామంది ఈవైపు వచ్చేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

గతంలో టీడీపీ లో రేవంత్ రెడ్డి( Revanth Reddy )తో సన్నిహితంగా మెలిగి, ఆ తర్వాత టిడిపి ప్రభావం తగ్గిన తర్వాత, వివిధ పార్టీల్లో చేరిన నేతలంతా ఇప్పుడు పాత పరిచయాలను గుర్తు చేస్తూ.రేవంత్ కు దగ్గర అయ్యేందుకు, కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Tdp, Patnammahendar, Prakash Goud, Revanth Reddy, Teegala Krishna, Telang

గతంలో టిడిపి నుంచి బీఆర్ఎస్( BRS ) లోకి చాలామంది నేతలే వచ్చి చేరారు.బీఆర్ఎస్ లో మంత్రులుగాను, ఎమ్మెల్యేలుగాను, ఇతర కీలక పదవులను అనుభవించిన వారు ఎంతోమంది ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండడంతో పాత పరిచయాలను గుర్తు చేస్తూ.కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.ఈ జాబితాలో చాలామంది కీలక నేతలే ఉన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీత, వికారాబాద్ జడ్పీ చైర్మన్ గా పనిచేశారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ఇద్దరు ఆ పార్టీలో చేరిపోయారు.

అలాగే మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి( Teegala Krishna Reddy ) కూడా టిడిపిలో కీలక పదవులు అనుభవించారు.హైదరాబాద్ మేయర్ గాను పనిచేశారు.

ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.అలాగే టిడిపి మాజీ నేత, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu Tdp, Patnammahendar, Prakash Goud, Revanth Reddy, Teegala Krishna, Telang

అలాగే జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి దంపతులతో పాటు అనేకమంది కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీ లు ఇలా చాలామంది కాంగ్రెస్ ల చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.వరంగల్ మున్సిపల్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ లో చేరారు.త్వరలోనే కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను భర్తీ చేసే కసరత్తు జరుగుతుండడంతో, రేవంత్ తో పాత పరిచయాలు ఉన్న నేతలంతా ఆ స్నేహాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకుని, నామినేటెడ్ పదవులు, ప్రాధాన్యం పొందేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు .ఈ జాబితాలో ఎక్కువమంది మాజీ టిడిపి నేతలే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube