'గుర్తుపెట్టుకో మిస్టర్ చీఫ్ మినిస్టర్ '  కేటీఆర్ వార్నింగ్ 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.

కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేస్తున్న కామెంట్లపై ఘాటుగా స్పందించిన కేటీఆర్ ఈ మేరకు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు.

నువ్వు స్లిప్పర్లు వేసుకుని రాజకీయాల్లోకి వచ్చేందుకు పనికిమాలిన పోరనిలా తిరుగుతున్నప్పుడే ఆయన తెలంగాణ కోసం తెలంగాణ(Telangana) ప్రజల కోసం తన పదవికి తృణప్రాయంగా రాజీనామా చేశారు .నువ్వు పార్టీ టికెట్ కోసం లాబీయింగ్ లో బిజీగా ఉన్నప్పుడే ఆయన తెలంగాణ స్వరాష్ట్రం కావాలని స్వాప్నించాడు.ఎంతో పట్టుదలతో పోరాటం చేసి తెలంగాణ సాధించాడు.

తెలంగాణ గొంతుకులను అణిచివేయడానికి నువ్వు తుపాకీ పట్టుకున్నప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టాడు.తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి నీ చేతులు డబ్బుల బ్యాగులు పట్టుకున్నప్పుడు సాధించిన తెలంగాణను దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా తయారు చేసేందుకు ఆయన తన మేధస్సుకు పదునుపెట్టారు.

సాధించిన తెలంగాణను సగరువంగా తలెత్తుకునేలా చేసిన ఆయన ఈ రాష్ట్రానికి గర్వకారణం.నీలాంటి జోకర్ ఆయన మీద పిచ్చి ప్రచారాలు చేస్తూ దుర్భాషలాడి చరిత్ర నుంచి ఆయన పేరు చెరిపి వేయవచ్చని అనుకోవడం మూర్ఖత్వం.

Advertisement

తెలంగాణ ఉన్నంతకాలం కెసిఆర్ ఉంటారు.ఆ పేరును ఎవరు చెరిపి వేయలేరు.గుర్తుపెట్టుకో  మిస్టర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ అంటూ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కి వార్నింగ్ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శలు చేశారు.పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి,  మేఘ సంస్థకు  టెండర్లు దక్కేలా చేయడం అంటేనే.నీకు ఇది నాకు అది అని క్రోనీ క్యాపిటల్ ఇజానికి పాల్పడుతూ అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని కేటీఆర్ విమర్శించారు.

ఎల్ అండ్ టి.ఎన్ సీ సీ (L&T, NCC)లాంటి పెద్ద కంపెనీలకు టెండర్లు దక్కకుండా కావాలని చేశారని కేటీఆర్ విమర్శించారు.

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న రాకింగ్ రాకేష్ కేసీఆర్.. ఇక్కడైనా హిట్టవుతుందా?
Advertisement

తాజా వార్తలు