ఏపీలో ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ విడుదల అయ్యాయి.ఈ మేరకు సుమారు 4.07 లక్షల మందికి వడ్డీ రీయింబర్స్ కింద రూ.46.9 కోట్లను సీఎం జగన్ విడుదల చేశారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు.
ఇళ్లు కట్టుకుంటున్న అక్కాచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు అందించిన సంగతి తెలిసిందే.ఆ పై వడ్డీ భారాన్ని సైతం ఏపీ ప్రభుత్వం భరిస్తుంది.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ సుమారు 31 లక్షల ఇళ్ల్ స్థలాలను అక్కాచెల్లెమ్మలకు ఇచ్చామన్నారు.ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా వడ్డీ రీయింబర్స్ మెంట్ అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.