తెలంగాణభవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘స్వేదపత్రం’ ను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
శ్వేతపత్రాలు అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం సభను వాయిదా వేసి పారిపోయిందని కేటీఆర్ ఆరోపించారు.సభలో తమకు మాట్లాడే హక్కును కూడా కల్పించకుండా గొంతును నొక్కేసిందని విమర్శించారు.
విధ్వంసం నుంచి వికాసం వైపు సంక్షోభం నుండి సమృద్ధి వైపు తీసుకెళ్లామని తెలిపారు.దేశ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయమని వెల్లడించారు.







