రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి... మరి టికెట్ రేట్ సంగతేంటి?

కరోనా కారణం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలన్నీ కూడా విడుదలను వాయిదా చేసుకొని సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి.

ఈ క్రమంలోనే దేశంలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు మెల్లిగా వారి సినిమా విడుదల తేదీలను ఒక్కొక్కరుగా ప్రకటిస్తూ వచ్చారు.

ఈ క్రమంలోనే భారీ బడ్జెట్ చిత్రాల నుంచి చిన్న సినిమాల వరకు ప్రతి ఒక్కరు రిలీజ్ డేట్స్ ను అధికారికంగా ప్రకటించారు.ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల రేట్లను తగ్గించిన విషయం మనకు తెలిసిందే.

ఈ విషయం గురించి ఎన్నో చర్చలు జరిగాయి.గత కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి సైతం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవడంతో సినిమా టికెట్ల రేట్లు వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని భావించారు.

సీఎంని కలిసిన మెగాస్టార్ చిరంజీవి టికెట్ల రేట్ల విషయంపై ఏపీ సీఎం సానుకూలంగా ఉన్నారని ఈ విషయంపై మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే చిరంజీవి ముఖ్యమంత్రిని కలిసి దాదాపు 20 రోజులు పూర్తయింది.

Release Dates Fixed What About The Ticket Rates Details, Release Date, Tollywoo
Advertisement
Release Dates Fixed What About The Ticket Rates Details, Release Date, Tollywoo

ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి ప్రకటన వెలువడకపోవడంతో చిత్ర నిర్మాతలు మరోసారి ఈ విషయాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు.ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు విడుదల తేదీలను ప్రకటించి విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ టిక్కెట్ల రేట్లపై ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో మరోసారి ఈ వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.మరి టికెట్ల వ్యవహారం పై ఏపీ ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారు అసలు టిక్కెట్ల రేట్లు పెంచుతారా లేకపోతే అదే టికెట్ల రేట్లతో సినిమాను విడుదల చేయాలనే సందిగ్ధంలో నిర్మాతలు ఉన్నారు.

మరి ఈ విషయంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో వేచిచూడాలి.

Advertisement

తాజా వార్తలు