భారతదేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ వ్యాప్తి ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇందులో భాగంగా భారతదేశంలో ఆన్ లైన్ ఫార్మసి విక్రయాలు మరింత జోరు అందుకున్నాయి.
ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసేందుకు తాజాగా ఆన్ లైన్ ఫార్మసి రంగంలోకి ప్రవేశించింది.ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఫార్మా సంస్థ నెట్ మేడ్స్ లో మెజారిటీ వాటాను కైవసం చేసుకుంది.ఇందుకు సంబంధించి 83 మిలియన్ డాలర్లు అనగా భారతదేశంలో రూ.620 కోట్లను చెల్లించింది రిలయన్స్.
విటాలిక్, అలాగే దాని అనుబంధ సంస్థలు భారతదేశంలో గత ఐదు సంవత్సరాల నుండి ఫార్మా పంపిణీ విక్రయాలు, మొదలగు సేవల రంగంలో దేశ ప్రజలకు సేవలు అందిస్తున్నాయి.ఈ విలీనం ద్వారా హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ లో 60 శాతం, మిగతా సంస్థలకు సంబంధించి 100% రిలయన్స్ సొంతం అయినట్లు రిలయన్స్ అధికారులు తెలియజేశారు.
విటాలిక్ దాని అనుబంధ సంస్థలు అన్ని కలిపి ఒకే ఫ్లాట్ఫామ్ గా నెట్ మెడ్స్ అనే పేరుతో సేవలను అందిస్తున్నాయి.

ఇక వీరికి ఇప్పుడు రిలయన్స్ చేతులు కలపడంతో భారతదేశం వినియోగదారులకు మరింత దగ్గర అవుతామని, అలాగే ఆరోగ్య సంబంధిత వస్తు సేవలను కూడా మరింతగా చేర్చవచ్చని నెట్ మెడ్స్ అధికారులు తెలియజేశారు.ఇలా కలవడం ద్వారా తమ వ్యాపారం మరింతగా విస్తృతం కాబోతుందని, రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.అనతికాలంలోనే దేశం నలుమూలల తమ సేవలను విస్తరింపజేసేందుకు నెట్ మెడ్స్ భాగస్వామ్యం తో మరిన్ని రంగాలలో దూసుకు వెళ్తామని తెలియజేశారు.