ఈ ఐదు ర‌కాల ఫుడ్స్ మీ డైట్ లో ఉంటే ఇర్రెగ్యుల‌ర్ పీరియ‌డ్స్ కు బై బై చెప్పొచ్చు!

ఇటీవ‌ల రోజుల్లో చాలా మంది ఆడ‌వారు ఇర్రెగ్యుల‌ర్ పీరియ‌డ్స్ తో బాధ‌పడుతున్నారు.

హార్మోన్ల అసమతుల్యత, అధికంగా ఆల్కహాల్ తీసుకోవ‌డం, ఒత్తిడి, ర‌క్త‌హీన‌త‌ త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల పీరియ‌డ్స్ క్ర‌మం త‌ప్పుతుంటాయి.

దాంతో అనేక స‌మ‌స్యల‌ను ఫేస్ చేస్తూ ఉంటారు.అయితే కొన్ని కొన్ని ఆహారాలను తీసుకోవ‌డం ద్వారా ఇర్రెగ్యుల‌ర్ పీరియ‌డ్స్(irregular periods) కు బై బై చెప్పొచ్చు.

మ‌రి ఋతు చక్రాన్ని క్రమబద్ధీకరించడంలో సహాయపడే ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇర్రెగ్యుల‌ర్ పీరియ‌డ్స్ తో బాధ‌ప‌డుతున్న‌వారు నిత్యం వ‌న్‌ టేబుల్ స్పూన్ నువ్వుల‌ను(Sesame seeds) తీసుకోవాలి.నువ్వులు మీ శరీరంలో వేడిని సృష్టిస్తాయి.అదే స‌మ‌యంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్‌లను సమతుల్యం చేయడంలో సహాయపడే మెగ్నీషియం, జింక్ (Magnesium, Zinc)వంటి ముఖ్యమైన ఖనిజాలను అందిస్తాయి.

Advertisement

స‌రైన మోతాదులో నువ్వుల‌ను తీసుకుంటే నెల‌స‌రి క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌స్తుంది.అలాగే పీరియ‌డ్స్ స‌క్ర‌మంగా రావ‌ట్లేద‌ని స‌త‌మ‌తం అవుతున్న‌వారు వారానికి క‌నీసం రెండు సార్లు చెరకు ర‌సం తీసుకోండి.

చెరకు రసం హార్మోన్లను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.శ‌రీరంలో ఇనుము స్థాయిలను తిరిగి నింపుతుంది.ఇర్రెగ్యుల‌ర్ పీరియ‌డ్స్ కు చెక్ పెడుతుంది.

వాము.(Ajwan).జీర్ణ ఆరోగ్యానికి మాత్రమే కాదు రుతుచక్రాన్ని నియంత్రించడంలో కూడా స‌హాయ‌ప‌డుతుంది.

రోజూ ఉద‌యం ఒక గ్లాస్ వాట‌ర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ వాము (Ajwan )వేసి మ‌రిగించి తీసుకోవాలి.ఈ విధంగా చేస్తే పీరియ‌డ్స్ టైమ్ టూ టైమ్ వ‌స్తాయి.

ఆ సినిమాపైనే నిఖిల్ అభిమానుల ఆశలు.. అభిమానుల కోరిక నెరవేరుతుందా?
వామ్మో.. యాపిల్ టీతో ఇన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చా..?

మ‌రియు వాములోని యాంటీ-స్పాస్మోడిక్ లక్షణాలు నెల‌స‌రి స‌మ‌యంలో నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తాయి.నెల‌స‌రి క్ర‌మం త‌ప్ప‌కుండా రావాలంటే బొప్పాయిని(Papaya) తీసుకోండి.

Advertisement

బొప్పాయి శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలను ప్రేరేపిస్తుంది.గర్భాశయ కండరాలు సంకోచించడంలో కూడా సహాయపడుతుంది.

ఇక రుతుక్రమ సమస్యలతో బాధపడే స్త్రీలకు దాల్చిన చెక్క(Cinnamon) ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది.పిసిఒఎస్ నివార‌ణ‌కు మ‌రియు ఇర్రెగ్యుల‌ర్ పీరియ‌డ్స్ కు చెక్ పెట్ట‌డానికి దాల్చిన చెక్క ఉప‌యోగ‌ప‌డుతుంది.అందుకోసం దాల్చిన చెక్క‌తో టీ త‌యారు చేసుకుని తీసుకోండి.

తాజా వార్తలు