వింటర్ సీజన్ రానే వచ్చింది.పొద్దు పొద్దున్నే కురిసే మంచు, చల్ల గాలి (Snow, cold wind)మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
కానీ చలికాలంలో సరైన తేమ లేకపోవడం వల్ల చర్మం తరచూ పొడిబారి పోతుంటుంది.ఎంత ఖరీదైన మాయిశ్చరైజర్స్ వాడినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది.
అలా అని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు.వింటర్ లో వేధించే పొడి చర్మానికి (dry skin)ఈజీగా అడ్డుకట్ట వేయొచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ ఆయిల్ అద్భుతంగా తోడ్పడుతుంది.
ఆయిల్ తయారీ కోసం ముందుగా ఒక క్యారెట్(Carrot) తీసుకుని పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.
అలాగే రెండు నిమ్మ(lemons) పండ్లకు ఉన్న తొక్కను సపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె(coconut oil) పోసుకోవాలి.
అలాగే క్యారెట్ తురుము, నిమ్మ తొక్కలు మరియు నాలుగు లవంగాలు(cloves) వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో 15 నిమిషాల పాటు ఉంచి ఉడికించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారాక ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.
ఈ ఆయిల్ ను ఫేస్ తో పాటు బాడీకి కూడా ఉపయోగించవచ్చు.ప్రస్తుత చలికాలంలో ఈ ఆయిల్ ను రోజుకు ఒకసారి కనుక అప్లై చేసుకుంటే మస్తు లాభాలు పొందుతారు.
ఈ ఆయిల్ చర్మాన్ని ఎక్కువ సేపు తేమగా ఉంచుతుంది.డ్రై (Dry)అవ్వకుండా రక్షిస్తుంది.అలాగే ఈ ఆయిల్ ను రెగ్యులర్ గా యూస్ చేయడం వల్ల స్కిన్ స్మూత్ గా మరియు షైనీ గా మారుతుంది.స్కిన్ కలర్ పెరుగుతుంది.చర్మంపై ఏమైనా ఉంటే మచ్చలు ఉన్నా కూడా తగ్గుముఖం పడతాయి.