ఖమ్మం నగర పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగతనాలతో ప్రజలను భయభ్రంతులకు గురిచేస్తున్న నిందుతుడిపై ప్రివెంటివ్ డిటెక్షన్ ( పి.డి యాక్ట్ ) నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్.
వారియర్ తెలిపారు.చోరి నేరాల నియంత్రణలో భాగంగా జిల్లాలో తరచూ నేరాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొవాలనే ఉద్దేశ్యంతో నిందితులపై పిడీ యాక్ట్ నమోదు చేశామని తెలిపారు.
నగరంలో పలు ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయల వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చాకచక్యంగా దొంగిలిస్తున్న కూసుమంచి మండలం, ఎర్రగడ్డ తండా కు చెందిన భూక్యా తిరుపతి (29)పై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో (5) కేసులు, ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ (01) కేసులు నమోదు అయినట్లు తెలిపారు.ఇతని నుండి 13 ద్విచక్రవాహనాలు రికవరీ చేసినట్లు తెలిపారు.2021 ఏడాది ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించినా, మళ్లీ అనతికాలంలోనే జామిని పై విడుదలై తిరిగి తరచూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.ఇలాంటి అలవాటు పడిన నిందితుడి వల్ల ప్రజల భద్రతకు ముప్పు కలుగుతుందనే నేపథ్యంతో ఇతని దొంగతనాలకు శాశ్వతంగా చెక్ పెట్టడానికి పి.డి యాక్ట్ అమలు చేసి న్యాయస్థానం ఆదేశాలతో ఖమ్మం టూ టౌన్ సిఐ కుమారస్వామి నిందుతుడిని హైదరాబాదు చంచల్ గూడ సెంట్రల్ జైలు తరలించినట్లు తెలిపారు.







